KNR: దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మద్యం ఏరులై పారింది. మొన్న ఒక్కరోజే సుమారు రూ.16 కోట్ల విలువగల మద్యాన్ని ప్రజలు త్రాగారు. కరీంనగర్,పెద్దపల్లి, జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాలకు దసరాకు ఒకరోజు ముందు ఐఎంఎల్ డిపో నుంచి రూ.16 కోట్ల లిక్కర్ తీసుకెళ్లారు. సాయంత్రానికే దాదాపు అన్నీ వైన్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి.