ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. డ్యాన్స్ చేస్తుండగానే అతను గుండె నొప్పితో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సబంధించిన పూర్తి వవరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే… బర్త్ డే పార్టీకి హాజరైన ఓ వ్యక్తి బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తున్నాడు. పాటకు తగ్గట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్నాడు. కాసేపు అలానే డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. చప్పట్లు కొడుతూ అతడిని అంతా ప్రోత్సహిస్తున్న వేళ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అందరూ షాకయ్యారు. వెంటనే అందరూ వచ్చిలేపినా లేవలేదు. కంగారుపడి చూడగా చలనం లేకుండా పోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు వదిలాడని చెప్పారు. అతని వయసు 48ఏళ్లు అని సన్నిహితులు చెబుతున్నారు. అతని మరణంతో స్నేహితులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
అతను డ్యాన్స్ చేస్తూ సడెన్ గా కుప్పకూలిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా కూడా మరణం వస్తుందా అని అందరూ షాకౌతున్నారు. చివరి నిమిషం వరకు ఆయన ఆనందంగా డ్యాన్స్ చేయడం గమనార్హం.