ఎయిర్ ఏసియా సీఈవో మేనెజ్ మెంట్ మీటింగ్‌ను షర్ట్ లేకుండా నిర్వహించారు. అంతేకాదు మసాజ్ కూడా చేయించుకుంటున్నారు. ఆ ఫోటోను లింక్ డిన్‌లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Air Asia CEO: అధికార సమావేశాలు అంటే.. డ్రెస్ కోడ్ కంపల్సరీ. కానీ కొందరు వాటిని పాటించడం లేదు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత వర్చువల్‌గా మీటింగ్స్‌గా ఎక్కువగా జరుగుతున్నాయి. కంపెనీ గ్రోత్, తీసుకోవాల్సిన చర్యలపై డిస్కష్ చేస్తుంటారు. మలేషియాకు చెందిన ఎయిర్ లైన్ కంపెనీ ఏయిర్ ఏసియా (Air Asia).. దాని సీఈవో (CEO) టోని ఫెర్నాండెజ్.. ఇటీవల మేనెజ్ మెంట్ మీటింగ్ నిర్వహించారు. సమావేశంలో ఆయన షర్ట్ లేకుండా పాల్గొన్నాడు. ఆ ఫోటోను అతనే సోషల్ మీడియాలో షేర్ చేసి.. నెటిజన్ల ట్రోల్స్‌కు గురయ్యాడు.
మసాజ్ చేయించుకుంటూ..
లింక్డిన్లో నిన్న ఆ ఫోటో పోస్ట్ చేశారు. తమ కంపెనీ మేనెజ్ మెంట్ మీటింగ్ నిర్వహిస్తోందని రాసుకొచ్చారు. అతను షర్ట్ వేసుకోలేదు.. సరికదా.. వెనకాల తనకు మసాజ్ చేయించుకుంటూ రిలాక్స్ అయ్యాడు. వారంలో పని ఒత్తిడి, వెరానిటా యోసెఫిన్ సలహా మేరకు మసాజ్ చేయించుకున్నానని రాసుకొచ్చారు. మసాజ్ చేయించుకునేందుకు అనుమతి ఉందని.. ఇండోనేషియా, ఎయిర్ ఏషియా కల్చర్ ఇష్టపడతానని చెప్పారు. ఆ సమావేశంలో షర్ట్ లేకుండా.. మసాజ్ చేయించుకుంటూ కనిపించగా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ఏకీపారేసిన నెటిజన్లు
ఫోటోను షేర్ చేయగా.. 500 సార్ల లైక్ చేశారు. చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇలా సమావేశం నిర్వహించడం సరికాదని రాశారు. ఓ పబ్లిక్ లిస్టేట్ కంపెనీ సీఈవో.. షర్ట్ తీసి, మసాజ్ చేసుకుంటూ మీటింగ్ నిర్వహించడం ఏంటీ..? అతనిని వెంటనే పదవీ నుంచి తొలగించాలని ఒకరు రాశారు. అతని తీరు సరికాదన్నారు. చాలా రోజుల తర్వాత మీటింగ్ జరిగిందని.. కానీ సమావేశం కోసం అయినా షర్ట్ వేసుకుంటే బాగుండేదని మరొకరు రాశారు. పని విధానాన్ని ఇలా చూపించడం సరికాదు. మీరు ఆశించిన దానిని ఇస్తున్నారని మాత్రం అనుకోకండి మూడో యూజర్ రాశారు.
ఇదేం కల్చర్
ఓ మహిళా ఇలా పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి తనకు కలిగిందని.. దీంతో మనం ఏం చేస్తున్నాం.. వ్యక్తిగత రక్షణకు సమయం లేదా..? ఇది ఏం సంస్కృతి.. యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నామని సీఈవోపై నాలుగో యూజర్ ఫైర్ అయ్యాడు. ఇలా నెటిజన్లు సీఈవో తీరును ఎండగట్టారు.