NZB: రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించడం లేదని బుధవారం ఉదయం 11గంటల వరకు కూడా కార్యాలయంలో సిబ్బంది రాకపోవడం గమనార్హం. వివిధ పనుల నిమిత్తం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చే వారు కార్యాలయ సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.