MNCL: మంచిర్యాలలోని గోదావరి నది తీరంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జాతరలో విక్రయాలకు సంబంధించి నిర్వహించిన వేలం పాట ద్వారా ఈసారి అదనంగా రూ.4.25 లక్షల ఆదాయం సమకూరింది. 2024లో వేలం పాట ద్వారా 8.14 లక్షలు రాగా, ఈసారి రూ.12, 39, 500 ఆదాయం వచ్చింది.