TG: నిజామాబాద్ జైలు అధికారులపై ఉన్నతాధికారులు కొరడా ఝులిపించారు. ఇటీవల జైలు ఆవరణలో ఖైదీల వద్ద గంజాయి వంటి మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి. ఖైదీ సాయిలుపై దాడి చేసిన జైలర్ ఉపేందర్‌ను సస్పెండ్ చేశారు. మరో జైలర్ సాయిసురేష్ను బదిలీ చేశారు. అదేవిధంగా జైలు సూపరింటెండెంట్ దశరథంపై చర్యలు తీసుకున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న ఏడుగురు ఖైదీలను ఇతర జైళ్లకు తరలించారు.