TG: పోలీసు శాఖలో నూతన అధ్యాయం మొదలైంది. దుండిగల్ పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్ స్వరూప.. సామాన్యులకు అర్థమయ్యేలా ఇంగ్లీష్‌కు బదులు తెలుగులో ‘ఛార్జ్‌షీట్’ దాఖలు చేశారు . మేడ్చల్ కోర్టులో ఆమె సమర్పించిన ఈ నివేదికపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మాతృభాషలో దర్యాప్తు పూర్తి చేసినందుకు ఆమెను డీజీపీ శివధర్ రెడ్డి, శిఖా గోయల్ ప్రత్యేకంగా అభినందించారు.