»Silent Walking Invented By Generation Z Is Trending On Social Media
Silent walking: నెట్టింట్లో కొత్త ట్రెండ్.. సైలెంట్ వాకింగ్
ప్రస్తుతం ఏది ఎప్పుడు ట్రెండ్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. అంతేకాదు పరిస్థితిలు కూడా అప్పుడప్పుడు తారు మారు అవుతుంటాయి. తాజాగా ఓ నడక విధానం ట్రెండింగ్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Silent walking invented by Generation Z is trending on social media
Silent walking: ఆ మధ్య క్వైట్ క్విట్టింగ్.. అంటూ జెన్ జడ్ (Generation Z) వ్యక్తులు ఒక దాన్ని ట్రెండ్ చేసిన సంగతి తెలిసిందే. జీవితాంతం వర్క్ కే పరిమితం కావడం, సోమవారాలు పెద్దగా పని భారం పెట్టుకోకుండా ఉండేందుకు బేర్ మినిమమ్ మండేస్ అంటూ మరో ట్రెండ్‌ను మొదలుపెట్టారు. తాజాగా మరో ట్రెండ్ సైలెంట్ వాకింగ్ (Silent Walking) తీసుకొచ్చారు. ఈ ట్రెండ్ ఏంటి.? దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం.
అమెరికాకు చెందిన మ్యాడీ మే అనే పాడ్‌కాస్టర్ ఈ సైలెంట్ వాకింగ్ ట్రెండ్‌ను పరిచయం చేశారు. నడక సమయంలో టెక్నాలజీకి దూరంగా ఉండడమే ఈ కొత్త విధానం. వాకింగ్ వెళ్లేటప్పుడు ఎయిర్‌పాడ్స్, పాడ్‌కాస్ట్‌లు, మ్యూజిక్ వంటి వాటికి దూరంగా ఉండాలి. మొదట ఇలా చేయడం చాలా కష్టమే కానీ క్రమంగా ఇది అలవాటైపోతుందని చెప్పారు. అమెరికాలో టిక్ టాక్‌లో ఇది ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు దీన్ని 5 లక్షల మంది వరకు చూశారు. సైలెంట్ వాకింగ్‌తో రెండు నిమిషాలు నడక కాస్త అయోమయంగానే ఉంటుంది. తరువాత అందులో అసలు తత్వం బోధపడుతుంది. విశ్వంలోని అనేక ప్రాణులు చేసే శబ్ధాలు మెదడుకు ఆనందాన్ని ఇస్తాయి. విశ్వం రహస్యం ఏదో చెవులో గుసగుసపెడుతున్నట్లు అనిపిస్తుంది. ఒంటరిగా నడవడం వల్ల కొత్త ఆలోచనలు వస్తాయి అని పేర్కొన్నాడు. ఇంతకు ముందే న్యూయార్క్ సిటీకి చెందిన ఓ ఇన్ఫ్లూయెన్సర్ ఇదే విషయాన్ని గతంలో చెప్పారు. కానీ అతని వీడియో పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. మ్యాడీ వీడియో వైరల్ కావడంతో కొత్త ట్రెండ్ మొదలైంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.