చిన్నా, పెద్దా అని తేడాలేకుండా అందరూ నూడిల్స్‌ను ఇష్టపడి తింటుంటారు. అంతేకాదు చాలా మంది ప్యాకెట్లలో దొరికేవాటిని కొనుగోలు చేసి పలురకాల వంటకాలుగా తయారు చేసుకుని ఆరగిస్తారు. ఇంతకీ వాటిని ఎలా తయారు చేస్తారో తెలుసా? దీని తయారీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు నూడుల్స్ తినాలంటేనే ఆలోచిస్తారు.
Video of making noodles in Kolkata is viral.. If you watch the video, you will not be able to eat noodles
Viral Video: 5జీ జనరేషన్లో కూడా చాలా మందికి ఇంట్లో వండే టైమ్ లేక హోటల్స్ నుంచి నూడిల్స్ తెప్పించుకుంటారు. అలాగే తక్కువ టైమ్ పడుతుందని ఫాస్ట్ ఫుడ్(Fast food) ఆర్డర్ ఇస్తారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ నూడిల్స్‌ను ఇష్టంగా తింటుంటారు. ఇక నూడిల్స్‌ను షాపుల నుంచి తీసుకొచ్చి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా ఈ నూడిల్స్ మేకింగ్(Making noodles)కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీనిపై నేటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
కొలకత్తా(Kolkata)లోని ఓ కంపెనీ నుంచి నూడిల్స్ తయారు చేసే వీడియోను నిఖిల్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దాదాపు 3.2 మిలియన్ల మంది చూసిన ఈ వీడియోకు 49వేలకు పైగా లైక్స్ కొట్టారు. అంతా బాగానే ఉంది కానీ నూడిల్స్ తయారీలో వారు ఏ మాత్రం పరిశుభ్రతను పాటించడం లేదు. మైదా పిండి తీసుకొచ్చింది మొదలు, నూడిల్స్ మేకింగ్‌లో కార్మికులు చేతులకు గ్లౌజ్‌లు, తల వెంట్రుకలు పడకుండా ఎలాంటి చర్యలు లేవు. ఇలా ఎలాంటి శుభ్రత ప్రమాణాలను పాటించకుండా నూడిల్స్ ను తయారు చేయడం చూసిన పలువురు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఫుడ్‌ను మనం ఎగబడి తింటున్నామా అని ప్రశ్నించుకుంటున్నారు. వామ్మో ఈ తయారీని చూస్తేనే భయంగా ఉందని మరికొంత మంది చెబుతున్నారు.