»Tesla Car Protection From The Attack Of Hamas Militants Elon Musk Reacts
Tesla car: హమాస్ మిలిటెంట్ల దాడి నుంచి టెస్లా కార్ రక్షణ..ఎలాన్ మస్క్ రియాక్ట్
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగిన వేళ ఓ వ్యక్తి టెస్లా కార్ వల్ల తన ప్రాణాలను కాపాడుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయం తెలిసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దీనిపై స్పందించి ట్వీట్ చేశారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
Tesla car protection from the attack of Hamas militants Elon Musk reacts
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరిగిన వేళ హమాస్ మిలిటెంట్లు దాడి చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి అదృష్టవశాత్తు టెస్లా(Tesla) కారుచే రక్షించబడ్డాడు. ఆ వివరాలెంటో ఇక్కడ తెలుసుకుందాం. ఓ వ్యక్తి యుద్ధ సమయంలో టెస్లా మోడల్ 3 కారులో ప్రయాణిస్తున్నాడు. ఉగ్రవాదులు అతన్ని 10 గజాల దూరం నుంచి గుర్తించారు. ఆ క్రమంలో అతన్ని ఎటాక్ చేసేందుకు వారి వద్ద ఉన్న బుల్లెట్లతో కారు ముందు భాగంలో దాడి చేశారు. కానీ అది EV కారు కావడంతో దానికి ఏమి కాలేదు. అంతేకాదు అక్కడ ఇంజన్ లేదు. ఆ నేపథ్యంలోనే వారు ఫ్యూయల్ ట్యాంక్‌పై ఎటాక్ చేశారు. అయితే అక్కడ కూడా ట్యాంక్ కూడా లేదు. దీంతో వారు తన కారు టైర్లను పేల్చారని పేర్కొన్నాడు.
అయినప్పటికీ తాను కారు యాక్సిలరేటర్‌ను నొక్కి వారు వెంబడించడం స్పీడ్ కంటే వేకంగా తాను ప్రయాణించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. వారు తన టైర్లను కాల్చిన క్రమంలో కూడా టెస్లా కారు డ్యూయల్ డ్రైవ్ తనను రోడ్డుపై ప్రయాణించేలా చేసిందన్నారు. ఆ నేపథ్యంలో తాను త్వరగా వారి నుంచి తప్పించుకుని ఆసుపత్రికి చేరినట్లు తెలిపారు. ఆ క్రమంలోనే తన కాళ్ళకు, చేతికి బుల్లెట్లు తగిలాయన్నారు. దీంతోపాటు తలకు కూడా ఒకటి కొంచెం తాకిందన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. అయితే దాడి జరిగిన క్రమంలో టెస్లా కారుకు దాదాపు 100 బుల్లెట్ రంధ్రాలు ఉన్నట్లు తెలిసింది. దాదాపు 15 మంది ఆయుధాలు కలిగిన ఉగ్రవాదులు ఆ వ్యక్తిని వెంబడించారని అంటున్నారు. అంతేకాదు అతన్ని బయటకు తీసుకేందుకు రెస్క్యూ టీమ్ విండో అద్దాలు పగులగొట్టి బయటకు తీసినట్లు చెప్పారు.
This is the amazing story of how Tesla saved the life of one of the first Israelis to face Hamas. The story appeared on Walla website (link in the comments):
This is not how C, a resident of Kibbutz Mefalsim, planned to spend last Shabbat. But minutes after the Hamas forces… pic.twitter.com/CV70BrxihG
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టెస్లా కార్ల సంస్థ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) దీనిపై తనదైన శైలిలో స్పందించారు. అతను ప్రాణాలతో బయట పడినందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. ఇది తెలిసిన మరికొంత మంది నెటిజన్లు టెస్లా ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారని కామెంట్లు చేస్తున్నారు. టెస్లా ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిందని మరో వ్యక్తి పేర్కొన్నారు.