»Viral Video Of Congress Mp Adhir Chowdhury Riding Royal Enfield Bike With No Helmet
Viral video: హెల్మెట్ లేదు, చేతులొదిలి బైక్ నడిపిన కాంగ్రెస్ ఎంపీ
ఓ కాంగ్రెస్ ఎంపీ హెల్మెట్ లేకుండా, బైక్ పై జర్నీ చేస్తూ కనిపించారు. అంతేకాదు ఆ బైక్ నడుపుతున్న క్రమంలో చేతులు వదిలేసి ప్రయాణించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి ఎంపీ జర్నీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Viral video of Congress MP adhir chowdhury riding royal enfield bike with no helmet
కాంగ్రెస్ లోక్‌సభ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి(adhir ranjan chowdhury) ఆదివారం పశ్చిమ బెంగాల్(west bengal)లోని బెర్హంపూర్‌లో మోటార్‌సైకిల్ రైడ్ చేస్తూ ఆస్వాదించారు. అయితే ఆ క్రమంలో రోడ్డు భద్రత నిబంధనలు కనీసం పాటించకుండా బైక్ పై ప్రయాణించడం పట్ల పలువురు కామెంట్లు చేస్తున్నారు. రంజన్ చౌదరి బైక్ జర్నీ చేసిన సమయంలో హెల్మెట్ పెట్టుకోలేదు. దీంతోపాటు అతని బైక్(Bike) వెనుక మరో వ్యక్తి ఉన్నారు. ఆ నేపథ్యంలోనే బైక్ డ్రైవ్ చేస్తూ చేతులు వదిలిపెట్టి అలా కాసేపు ప్రయాణించారు. అధీర్ క్యాప్ ధరించి తన ప్రయాణాన్ని నవ్వుతూ ఉత్సాహంగా ఆస్వాదిస్తూ ప్రయాణించారు.
అంతేకాదు అతని పక్కన వచ్చిన అనుచరులు కూడా ద్విచక్రవాహనాలపై హెల్మెట్లు పెట్టోకోక పోవడం విశేషం. ఈ సంఘటనపై పోలీసులు తనకు జరిమానా విధిస్తే ఇబ్బంది లేదన్నారు. కానీ తాను రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతున్న ప్రాంతంలో ఎవరూ లేరని అధీర్ చెబుతున్నారు. ఒక వేళ ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి కిందపడితే ఎంపీతోపాటు పక్కన ఉన్న వారికి సైతం ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యంగా వాహనం నడపడమే కాకుండా ఫైన్ వేసినా పర్వాలేదని ఎంపీ(MP) చెబుతున్న సమాధానం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధీర్ చౌదరి ఎప్పుడూ వివాదాలకు కేంద్రంగా ఉంటాడు. గత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ అంశంపై ప్రధాని మోడీని విమర్శించిన అధీర్ దుష్ప్రవర్తన కారణంగా సస్పెండ్ అయ్యారు. తాను ప్రధాని మోడీ(modi)ని దూషించలేదని, మౌనంగా ఉండే పదాన్ని మాత్రమే వాడానన్నారు. ఆ తర్వాత ప్రివిలేజెస్ ప్యానెల్ ముందు హాజరై తన ప్రకటనను వివరించిన తర్వాత అతని సస్పెన్షన్ రద్దు చేయబడింది.