»Remal Cyclone Bangladesh West Bengal One Died Heavy Rain No Electricity
Remal Cyclone : బంగ్లా నుంచి బెంగాల్ వరకు విధ్వంసం సృష్టించిన రెమాల్ తుఫాను
రెమాల్ తుఫాను బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్ వరకు విధ్వంసం సృష్టిస్తోంది. తుపాను కారణంగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
Remal Cyclone : రెమాల్ తుఫాను బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్ వరకు విధ్వంసం సృష్టిస్తోంది. తుపాను కారణంగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బలమైన గాలుల కారణంగా చెట్లు నేలకూలాయి. కచ్చా ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ తీగలు పడిపోవడంతో ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. తుఫాను కారణంగా కోల్‌కతాలో భారీ వర్షం, బలమైన గాలులు వీస్తున్నాయి. కాంక్రీట్ ముక్క పడి ఒక వ్యక్తి మరణించాడని పోలీసులు తెలిపారు. రెమాల్ తుఫాను గంటకు 135 కి.మీ (సుమారు 84 mph) వేగంతో బంగ్లాదేశ్‌లోని మోంగ్లా పోర్ట్ , భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సాగర్ దీవుల తీర ప్రాంతాలను దాటింది.
సోమవారం తెల్లవారుజామున తుపాను క్రమంగా ఈశాన్య దిశగా కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మట్టి ఇళ్ళ పైకప్పులు ఎగిరిపోయాయి. బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్ వరకు మట్టి ఇళ్ళు దెబ్బతిన్నాయి. తుపాను ధాటికి ఒకరు మృతి చెందగా, లక్షలాది మంది ప్రజలు కరెంటు లేకుండా బతుకుతున్నారు. విద్యుత్ తీగలు తెగిపోవడంతో ఆయా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. పశ్చిమ బెంగాల్, పొరుగు దేశం బంగ్లాదేశ్ కలిసి తుఫానును ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా, బంగ్లాదేశ్ , భారతదేశం ప్రమాదకరమైన తుఫానులను ఎదుర్కొన్నాయి. బంగ్లాదేశ్ ఆదివారం ఉదయం తుఫాను ల్యాండ్ఫాల్కు ముందే సన్నాహాలు చేసింది. తుఫాను నుండి వారిని రక్షించడానికి మోంగ్లా, చిట్టగాంగ్ ఓడరేవులు, తొమ్మిది తీరప్రాంత జిల్లాల నుండి సుమారు 8 లక్షల మంది ప్రజలను ఆశ్రయాలకు పంపింది. భారతదేశంలో కూడా 1 లక్ష మందిని షెల్టర్లకు పంపారు.
దేశం ఎలాంటి సన్నాహాలు చేసింది?
తుఫాను విపత్తును నివారించడానికి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇప్పటికే 8 వేల షెల్టర్లను నిర్మించారు. అలాగే, భారతదేశంలో తుఫాను నుండి రక్షించడానికి నౌకాదళం నౌకలు, విమానాలు, వైద్య సహాయాన్ని సిద్ధంగా ఉంచింది. తుఫాను కారణంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ వర్షం కురిసింది. దీని కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. రోడ్లు నీటితో నిండిపోయాయి.. చెట్లు నేలకూలాయి, ఎన్డీఆర్ఎఫ్ బృందం వాటిని తొలగిస్తోంది.