యూపీ (UP) లోని ఘజియాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ట్రాఫిక్ ఎస్ఐపై మహిళ చెప్పుతో దాడి చేసింది. ఘజియాబాద్(Ghaziabad)లోని ఇందిరాపురం ప్రధాన రహదారిపై సదరు మహిళ తన వాహనాన్ని ఆపింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic jam) ఏర్పడింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి.. ట్రాఫిక్ జామ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఇక అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ ఎస్ఐ వాహనాన్ని రోడ్డుపై నుంచి వెహికల్ని తీసేయాలని సదరు మహిళను కోరాడు. ఆమె అవేమీ వినిపించుకోకుండా, ఎస్ఐపై చెప్పుతో దాడి చేసింది.
ఆత్మరక్షణ కోసం ట్రాఫిక్ ఎస్ఐ (Traffic SI) కూడా ఒకానొక దశలో పైకి చేయి లేపాడు. ఈ ఘటనను స్థానికులు తమ మొబైల్స్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాహనదారులు అందరూ చూస్తుండగానే ఘటన జరిగింది. దీంతో ప్రయాణికులు షాక్‌య్యారు. ఘటన పై ట్రాఫిక్ ఏసీపీ పూనం మిశ్రా (ACP Poonam Mishra) స్పందించారు. అసభ్యకరంగా, దురుసుగా ప్రవర్తించిన మహిళపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టామని చెప్పారు. గతంలోనూ ఆమె పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు నివేదికలు ఉన్నాయని పూనం మిశ్రా తెలిపారు.