KNR: గత పదేళ్ల పాలనలో కేటీఆర్ భారీ అక్రమాలకు పాల్పడ్డారని సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. సిరిసిల్లలో అన్యాయంగా టికెట్ దక్కించుకుని పదవులు అనుభవించారని, ఆయనను ఉరితీయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, అహంకారంతో మాట్లాడితే బంధించి కొడతామని ఆయన హెచ్చరించారు.