»A Young Man Who Took A Bath In Front Of Everyone In The Train
Viral Video : ట్రైన్లో అందరిముందు స్నానం చేసిన యువకుడు!
అందరూ చూస్తుండగానే ఓ యువకుడు రైల్లో బట్టలు విప్పి స్నానం చేశాడు. ఆ తర్వాత అక్కడే వేరే బట్టలు కూడా మార్చుకున్నాడు. చివరికి తాను దిగాల్సిన స్టేషన్లో దిగిపోయాడు. ఈ సంఘటన న్యూయార్క్ సిటీలోని సబ్వే ట్రైన్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
సోషల్ మీడియా(Social Media)లో పాపులారిటీ కోసం ఈ మధ్య చాలా మంది ఇష్టమొచ్చిన ప్రయోగాలన్నీ చేస్తున్నారు. నెట్టింట తమ వీడియోలు వైరల్(Viral) అవ్వడం కోసం ప్రత్యేకం ఏదోకటి చేసి వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్(Video Viral) అయిన సంగతి తెలిసిందే. అలా రైళ్లలో వింతగా పనులు చేసేవారు రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యి సెలబ్రిటీలుగా మారుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తాజాగా ఓ యువకుడు తాను ఫేమస్ అవ్వడం కోసం రైల్ లో ఓ పిచ్చి పని చేశాడు.
అందరూ చూస్తుండగానే ఆ యువకుడు రైల్లో బట్టలు విప్పి స్నానం చేశాడు. ఆ తర్వాత అక్కడే వేరే బట్టలు కూడా మార్చుకున్నాడు. చివరికి తాను దిగాల్సిన స్టేషన్లో దిగిపోయాడు. ఈ సంఘటన న్యూయార్క్ సిటీలోని సబ్వే ట్రైన్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
న్యూయార్క్ సిటీ రైలు కోచ్(Rail Coach)లో ఓ కంపార్టుమెంటులో ఒక వ్యక్తి ట్రాలీ బ్యాగుతో వచ్చాడు. సీట్ లో కూర్చున్న ఆ వ్యక్తి కాస్తా కొంతసేపటికి కాళ్ల షూస్, ప్యాంట్, షర్ట్‌లను తీశాడు. తాను తెచ్చుకున్న ట్రాలీ బ్యాగ్ ఓపెన్ చేసి చిన్న వాటర్ క్యాన్ లో నీళ్లను బ్యాగులో పోశాడు. ఆ స్పాంజిపై షాంపు వేసుకుని అందరూ చూస్తుండగానే స్నానం(Bath) చేశాడు.
ట్రైన్ (Train)లో స్నానం చేస్తున్న ఆ వ్యక్తిని చూసి పక్కనున్న వారు అక్కడి నుంచి లేచి వేరే చోటుకు వెళ్లిపోయారు. ఇంకొందరైతే ఆ వ్యక్తిని చూసి పగలబడి నవ్వుకున్నారు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం మళ్లీ ట్రెండింగ్ (Trending)లో నిలిచింది. 15 మిలియన్ వీక్షణలు, లక్షల్లో కామెంట్లు ఈ వీడియోకు వచ్చాయి. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో సందడి చేస్తోంది.