Trailer Release : ‘దిల్’ రాజు చేతుల మీదుగా ‘ఓ కల’ ట్రైలర్ రిలీజ్
తెలుగు తెరపై మంచి ప్రేమ కథాంశంతో కూడిన సినిమాలు(Movies) ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విడుదలకు సిద్ధమైన సినిమా ఓ కల(O kala). గౌరీష్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ మూవీకి దీపక్ కొలిపాక దర్శకత్వం వహించగా ఈనెల 13న డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney plus hot star)లో స్ట్రీమింగ్ కానుంది.
తెలుగు తెరపై మంచి ప్రేమ కథాంశంతో కూడిన సినిమాలు(Movies) ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విడుదలకు సిద్ధమైన సినిమా ఓ కల(O kala). గౌరీష్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ మూవీకి దీపక్ కొలిపాక దర్శకత్వం వహించగా ఈనెల 13న డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney plus hot star)లో స్ట్రీమింగ్ కానుంది. ఎటిర్నిటి ఎంటర్టైన్మెంట్, అహం అస్మి ఫిల్మ్ బ్యానర్లపై లక్ష్మీ నవ్య, రంజిత్ కుమార్, ఆదిత్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
‘ఓ కల’ ట్రైలర్ :
https://www.youtube.com/watch?v=J2BNzbYjWMA
తాజాగా ఓ కల (O kala) సినిమాకు సంబంధించిన ట్రైలర్(Trailer)ను చిత్ర యూనిట్‌తో కలిసి నిర్మాత దిల్ రాజ్(Dil Raju) రిలీజ్ చేశారు. ప్రేమ ఉన్నా కూడా ఆ విషయాన్ని చెప్పకపోవడంతో నరకం అనుభవించాల్సి ఉంటుందని ట్రైలర్లో సీన్స్ కట్ చేసి చూపించారు. ట్రైలర్ లాంచ్(Trailer Launch) సందర్భంగా నిర్మాత దిల్ రాజు(Dil Raju) చిత్ర యూనిట్ ను అభినందించారు.
ఓ కల(O kala) సినిమా బృందాన్ని నిర్మాత దిల్ రాజు(Dil Raju) అభినందించారు. సినిమా విజయం అందుకోవాలని ఆశించారు. ఏప్రిల్ 13వ తేదిన ‘ఓ కల’ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో నేరుగా స్ట్రీమింగ్ కానుందని, తప్పకుండా ఈ సినిమాను అందరూ చూసి ఆశీర్వదించాలని కోరారు. మంచి ప్రేమ కథాంశంతో ‘ఓ కల’ సినిమా తెరకెక్కించామని, ఈ సినిమా కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతగానో సహకరించారని డైరెక్టర్ దీపక్ కొలిపాక తెలిపారు.