RRR : ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ వస్తే పట్టించుకోని సినీ స్టార్లు!?
తెలుగు చలన చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)లో తొలిసారి ఓ తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు(Oscar award) వచ్చింది. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలోని నాటు నాటు సాంగ్(Natu natu song)కు అంతర్జాతీయ అవార్డు ఆస్కార్ రావడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఇలాంటి విషయాన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అయితే ఆస్కార్ అవార్డు గ్రహీతలు అయిన కీరవాణి(Keeravani), చంద్రబోస్ (Chandrabose)లకు అలాంటి సత్కారం అందిందా?
తెలుగు చలన చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)లో తొలిసారి ఓ తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు(Oscar award) వచ్చింది. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలోని నాటు నాటు సాంగ్(Natu natu song)కు అంతర్జాతీయ అవార్డు ఆస్కార్ రావడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఇలాంటి విషయాన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏంటో రుజువైన వేళ తెలుగు సినీలోకం మొత్తం అవార్డు గ్రహీతలను ప్రశంసించాలి. వారిని ఘనంగా సత్కరించాలి. అయితే ఆస్కార్ అవార్డు గ్రహీతలు అయిన కీరవాణి(Keeravani), చంద్రబోస్ (Chandrabose)లకు అలాంటి సత్కారం అందిందా? ఆదివారం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక వద్ద ఆస్కార్ అవార్డు గ్రహీతలను సన్మానించారు.
ఈ సన్మాన కార్యక్రమానికి సినీ పరిశ్రమ తరపున స్టార్లు మాత్రం అంతగా హాజరు కాలేదు. ఆ కార్యక్రమంలో తెలుగు సినీ స్టార్ హీరోలు కనిపించలేదు. కీరవాణి(Keeravani), చంద్రబోస్(chandrabose)లకు సన్మానం అంటే తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడున్న నాలుగు స్థంభాలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటివారు కచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్..ఇలా ప్రతి హీరో కార్యక్రమానికి విచ్చేసి ఆస్కార్ అవార్డు(Oscar award) గ్రహీతలను సత్కరించాలి. కానీ అలా జరగలేదు. మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఆర్ఆర్ఆర్ టీమ్ ను ఇంటికి పిలిచి సత్కరించారు.
టాలీవుడ్(Tollywood) తారలంతా కార్యక్రమానికి విచ్చేసి కీరవాణి(Keeravani), చంద్రబోస్(Chandrabose)లతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ నిన్న జరిగిన కార్యక్రమంలో అవేవీ కనిపించలేదు. కీరవాణి, చంద్రబోస్ లను సన్మానించడానికి హీరో రాజశేఖర్, హీరో సుశాంత్, ఇంకో హీరో రానా వంటివారు మాత్రమే వచ్చారు. మిగిలిన స్టార్లు ఎవ్వరూ కనిపించలేదు. చాలా మంది హీరోలు లోకల్ గానే ఉన్నా, మరికొంత మంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగులు జరుపుకుంటున్నా సన్మాన కార్యక్రమానికి మాత్రం రాలేదు.
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ నుంచి అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) కూడా ఆస్కార్ అవార్డు గ్రహీతలైన కీరవాణి(Keeravani), చంద్రబోస్ (Chandrabose)లను సత్కరించడానికి రాలేదు. హీరోలే అనుకుంటే దర్శకులు సైతం ఈ ఫంక్షన్ కు రాలేదు. త్రివిక్రమ్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. అసలు ఆర్ఆర్ఆర్(RRR) సినిమా హీరోలు ఇద్దరూ కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు లాంటి బడా ప్రొడ్యూసర్లు మాత్రం కార్యక్రమానికి వచ్చి కీరవాణి, చంద్రబోస్ లను అభినందించారు. ఇటువంటి గర్వించదగ్గ సన్మాన కార్యక్రమానికి అందరూ హాజరై వేడుకగా జరుపుంటే చాలా బావుండేదని సినీ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.