»17 Killed 30 Injured As Bus Falls Into Ditch In Bangladesh
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం..17 మంది దుర్మరణం
ఈమధ్య కాలంలో ఘోర రోడ్డు ప్రమాదాలు(Road Accidents) చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం బంగ్లాదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం(Accident)లో 17 మంది దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు గోడను ఢీకొట్టి కాలువలోకి పడిపోయింది. ఈ ఘటనలో మరో 30 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

బంగ్లాదేశ్ లోని మదారిపూర్ ప్రాంతంలోని కుతుబ్ పూర్ గ్రామం వద్ద ఈ ప్రమాదం(Accident) జరిగింది. సోనాదంగా నుంచి ఢాకాకు బయల్దేరిన బస్సు హైవేపై అదుపు తప్పింది. ఆ తర్వాత కాలువలోకి వేగంగా దూసుకెళ్లి గోడను ఢీకొనడంతో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) చేపట్టారు.
డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం(Accident) జరిగినట్లు తెలుస్తోంది. బస్సు వేగానికి టైర్ పగిలిపోయి డ్రైవర్(Driver) నియంత్రణ కోల్పోవడం వల్ల 17 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.