బెల్లి డ్యాన్స్ వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతుంది. డ్రమ్స్ బీట్‌ను తన డ్యాన్స్‌తో డామినేట్ చేసిన ఈ సుందరి ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇది చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు చూసేయండి మరి.
Woman’s incredible belly dance to drum beats will wow you. Watch
Viral news: విదేశాల్లో బెల్లీ డ్యాన్స్(belly dance)కు విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. క్లబ్స్లోనే కాదు ప్రయివేట్ పార్టీలలో కూడా చాలా ఆదరిస్తారు. తాజాగా ఒక మహిళ బెల్లీ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా నాజుగ్గా నడుముతో నాట్యం చేస్తున్న ఆ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్లిప్‌ను డ్యాన్సర్ లీలా ఐజాక్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలీలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఊదా రంగు దుస్తులను ధరించిన డ్యాన్సర్ ఐజాక్ డ్రమ్ బీట్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా..రిథమ్ కు తగ్గట్టు తన వయ్యారి నడుముతో లయ బద్దకంంగా నృత్యం చేస్తుంది. తన మనోహరమైన డ్యాన్స్‌తో వీక్షకులను కట్టిపడేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 3.4 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలా ఎలా చేయాలో నాకు నేర్పించరూ అంటూ నెటజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోలో ఉన్న డ్యాన్సర్ చాలా అద్భుతంగా ఉందంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. కచ్చితంగా మిమ్మల్ని చూస్తూనే బెల్లీ డ్యాన్స్ నేర్చుకుంటా అని మరో వ్యక్తి రాసుకొచ్చారు.