విమానం టేకాఫ్ అవుతుండగా ఓ వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించిన ఘటన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యునైటెడ్ ఫ్లైట్ శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో బెంజమిన్ అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఆ వ్యక్తి ఎమెర్జెన్సీ డోర్ నుంచి దూకేందుకు ప్రయత్నించాడు.
విమాన సిబ్బందిని చితకబాదిన వ్యక్తి వీడియో:
విమానం నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించిన బెంజమిన్ అంతకు ముందు సిబ్బందిని చితకబాదాడు. తనకు కేటాయించిన సీటు నుంచి తన భార్యను లేవమని బెంజమిన్ కోరాడు. అయితే ఆమె అక్కడి నుంచి లేవనని తెలిపింది. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి ఫ్లైట్ అటెండెంట్ లు కూడా అక్కడికి వచ్చారు.
సిబ్బంది మాటలకు కోపంతో ఊగిపోయిన బెంజమెన్ వారిని చితకబాదాడు. ఆ తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.