ఆడపిల్లలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. లైంగిక వేధింపుల(Sexual Harassment)కు అడ్డుకట్ట వేసేందుకు పొలీసులు అనేక రకాల చర్యలు చేపట్టినా లాభం లేకుండా పోతోంది. వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకూ మహిళలు, యువతులు, బాలికలపై వేధింపులకు పాల్పడుతున్నారు. మహిళలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే కొన్నిచోట్ల దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే లక్నోలో చోటుచేసుకుంది.
Mohammed Sahadat Ali, in police uniform used to follow school going Hindu girls in Lucknow every morning. There were lots of complaint but finally this brave lady confronts him & records him in action. Hope @dgpup will kick him out from service & register a POSCO case against… pic.twitter.com/PkdiZYXMsl
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) May 3, 2023
లక్నోలో స్కూలుకు వెళ్తున్న ఓ విద్యార్థిని ఓ హెడ్ కానిస్టేబుల్ వెంబడించి వేధింపులకు(Head Constable Harassment) గురిచేశాడు. ఆ హెడ్ కానిస్టేబుల్ బాలికను వెంబడిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. వీడియో చూసినవారు ఆ పోలీసును తిట్టిపోస్తున్నారు. వీడియోలో సైకిల్ పై వెళ్తున్న ఓ బాలికను స్కూటీపై వెళ్తున్న కానిస్టేబుల్ షాదత్ అలీ వెంబడిస్తున్నాడు. ఆ బాలికతో ఏవో మాట్లాడుతూ వేధిస్తున్నాడు. ఇదంతా వెనకే ద్విచక్రవాహనంపై వస్తున్న మరో మహిళ వీడియో(Video) తీసింది.
కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ మహిళ కానిస్టేబుల్ ను ఆపింది. ఆ అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నావని(Head Constable Harassment) ప్రశ్నించింది. అందరి ముందు ఆ కానిస్టేబుల్ ను నిలదీసింది. అతని ఫోన్ నంబర్, బైక్ నంబర్ చెప్పాలని అడిగింది. అతనిది ఎలక్ట్రిక్ బైక్ అని, నెంబరు లేదని కానిస్టేబుల్ చెప్పాడు. అమ్మాయిలను రోజూ ఇలా ఎందుకు వెంబడిస్తున్నావని ప్రశ్నించింది. వీడియోలో ఇదంతా రికార్డు కావడంతో ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ కానిస్టేబుల్ ను అధికారులు సస్పెండ్(Suspended) చేశారు. ఆ కానిస్టేబుల్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు లక్నో డీసీపీ హిర్దేశ్ కుమార్ వెల్లడించారు.