KNR: శాతవాహన విశ్వావిద్యాలయంను రాష్ట్రంలోనే ఉన్నతమైన విశ్వావిద్యాలయంగా అగ్రస్థానంలో నిలుపుతానని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన విశ్వావిద్యాలయం ఉపకులపతిగా ఉమేష్ కుమార్ పదవి బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు యూనివర్సిటీ అధికారులు సిబ్బంది ఆయనకి ఘన స్వాగతం పలికారు.