KMR: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసాను కల్పించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో వారు రైతులకు మద్దతుగా నిరసన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు జుబేర్, మోచి గణేష్, నర్సింలు గౌడ్, మోసిన్, టేకుర్ల సాయిలు, మంగలి సాయిలు, రమేష్, సుంచు శేఖర్ పాల్గొన్నారు.