KMR: ఉద్యోగులు ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రక్తదానం చేయవచ్చని తెలిపారు. ఉద్యోగులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని చెప్పారు. రక్తదానం చేయడం మహా గొప్పదానం అన్నారు.