»Ys Sharmila Meeting With Key Leaders On Party Merger
YS Sharmila: పార్టీ విలీనంపై ముఖ్య నేతలతో భేటీ
వైఎస్ షర్మిల పార్టీ విలీనంపై ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. 9 ఏళ్ల కేసీఆర్ పాలనను ఎండగడుతూ పార్టీని స్థాపించినా, ఎలాగైనా బీఆర్ఎస్ను ఓడించాలని కాంగ్రెస్కు మద్ధతు ఇచ్చారు.
YS Sharmila Meeting with key leaders on party merger
YS Sharmila: వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఆసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసిన తరువాత తన నిర్ణయాన్ని పార్టీ శ్రేణులకు, ప్రజలకు తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడంలో భాగంగా తాను కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా తాను ఎన్నికల బరినుంచి తప్పుకొని, తన అభిమానులను కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని కోరారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ కొత్త ప్రభుత్వాన్ని నిర్మించింది. దీంతో షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు పలు ప్రకటనలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు పార్టీలోని ముఖ్య నేతలతో సమావేశం అవడం కీలకంగా మారింది.
ఈ సమావేశం తరువాత హైదరాబాద్ నుంచి ప్రత్యేకవిమానంలో కడప వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఇడుపుల పాయ చేరుకొని తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళ్లు అర్పించనున్నారు. కుమారుడు రాజారెడ్డి వివాహం సందర్భంగా నూతన వధువరులను తీసుకొని వైఎస్ సమాధికి నివాళులర్పిస్తారు. అక్కడే తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నెల 4వ తేదీన ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నుంచి షర్మిల ఆహ్వానం అందినట్లు సమాచారం. ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. పార్టీని విలీనంతో చేయడంతో ఎఐసీసీ పదవి లేదా ఏపీ పీసీసీ పదవి ఇచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ మాత్రం ఏపీ పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. తమ నాయకురాలికి ఏఐసీసీ, సిడబ్ల్యుసి లో ఏదైనా కీలక పదవి వస్తుందని షర్మిల అభిమానులు ధీమాగా ఉన్నారు.