YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వైఎస్ షర్మిల-అనిల్ కుమార్ దంపతుల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17న జరగనున్నట్లు వైఎస్ షర్మిల సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. 2024లో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి, ప్రియమైన అట్లూరి ప్రియతో ఈ నెల 18న నిశ్చితార్థం వేడుక, ఫిబ్రవరి 17న వివాహం జరగనుందని తెలిపారు. కాబోయే వధూవరులతో కలిసి కుటుంబ సమేతంగా రేపు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకుంటామని తెలిపారు.
Wishing everyone a blessed 2024! Delighted to share the news of my son YS Raja Reddy’s engagement to his sweetheart Atluri Priya on January 18th, with their wedding set for February 17th, 2024. Tomorrow, we’ll visit YSR ghat at Idupulapaya, accompanied by the soon-to-be bride… pic.twitter.com/JVp91hppsi
రాజారెడ్డి, ప్రియా అట్లూరి నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రియా చట్నీస్ అధినేత ప్రసాద్ అట్లూరి మనవరాలు. ప్రస్తుతం వీళ్లు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆ దేశ పౌరసత్వం కూడా ఆమెకు ఉంది. వైఎస్ రాజా రెడ్డి అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటిలో బ్యాచిలర్ ఆండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును పూర్తి చేశారు.