తెలంగాణ(Telangana)లో మరో మూడు రోజుల పాటు వర్షాలు(Rain) పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Weather Department) తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాలకు వాతావారణ శాఖ ఎల్లో అలర్ట్(Yellow alert) జారీ చేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెడల్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్ వనపర్తి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది.
తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మంగళవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ(Weather Department) వెల్లడించింది.