టీవీ యాంకర్(TV Anchor), నటి వర్షిణి(Actress Varshini) మరోసారి వార్తల్లో నిలిచింది. యాంకర్ వర్షిణిపై సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ ఐపీఎల్(IPL) సీజన్లో వర్షిణి 3 సార్లు స్టేడియంకు వచ్చి మ్యాచ్ వీక్షించింది. ఆమె వచ్చిన ప్రతిసారీ హైదరాబాద్ జట్టు(Hyderabad Team) ఓడిపోతోందని సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వర్షిణిపై కోపంతో ఊగిపోతున్నారు. సన్ రైజర్స్ ఫ్యాన్స్ సెంటిమెంట్స్ ను ఫాలో అవుతూ ఉంటారు. మరోసారి వర్షిణి స్టేడియంలో కనిపిస్తే అంతుచూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సన్ రైజర్స్ (Sunrisers Hyderabad)కు ఇప్పుడున్న దరిద్రం చాలదా? ఇక నువ్వు కూడా తోడైతే హైదరాబాద్ టీమ్ కోలుకోవడం కష్టమేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే వర్షిణి అక్కా..దయచేసి స్టేడియం వద్దకు రాకు, ఇంకా సన్ రైజర్స్ జట్టుకు ప్లే ఆఫ్స్ కు అవకాశాలున్నాయి. నువ్వొస్తే అవి కూడా పోతాయి అంటూ కామెంట్స్(Comments) చేస్తున్నారు.
మే 7న రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్(Sunrisers Hyderabad) మ్యాచ్ ఉంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ ఫ్యాన్స్ వర్షిణిపై విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. వర్షిణిని మళ్లీ స్టేడియంకు వస్తే మ్యాచ్ ఓడిపోతుందని, అందుకే స్టేడియంకు రావొద్దని వర్షిణిని ఫ్యాన్స్ ప్రాధేయపడుతున్నారు. ఏప్రిల్ 18న, 24న, మే 4న జరిగిన సన్ రైజర్స్ మ్యాచ్ లకు వర్షిణి వెళ్లింది. ఈ మూడు మ్యాచుల్లోనూ హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. అందుకే కొందరు ఫ్యాన్స్ వర్షిణి(Varshini)పై ఇలా రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.