టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijaydevarakonda), సమంత కలిసి నటిస్తున్న మూవీ ఖుషీ(Khushi Movie). ఈ సినిమాకు శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ (Romantic Comedy Entertainer)గా తెరకెక్కుతోంది. ఖుషీ మూవీ గత ఏడాదే విడుదల కావాల్సి ఉంది. అయితే హీరోయిన్ సమంత(Actress samantha) అనారోగ్యం చెందడం వల్ల ఈ మూవీ షూటింగు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో రిలీజ్ మరింత ఆలస్యం అయ్యింది. ఈ మధ్యనే సామ్ మళ్లీ సెట్స్ లోకి అడుగుపెట్టడంతో షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఖుషీ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ ప్రోమో:
ఖుషీ మూవీ(Khushi Movie)ని ఈ ఏడాది సెప్టెంబర్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పటి నుంచే మూవీ ప్రమోషన్స్ ను మొదలు పెట్టేశారు. తాజాగా ఖుషీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్(First Singal song promo) చేశారు. పూర్తి సాంగ్ మే 9వ తేదిన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కాశ్మీర్ లోయల్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది.
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో సమంత(Samantha) పాత్రను రిలీల్ చేశారు. ఇందులో సమంత ముస్లిం యువతిగా కనిపించనుందా? లేకుండా క్రియేట్ చేసినా సన్నివేశమా అని తేలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ఖుషీ మూవీ(Khushi Movie)కి మలయాళ సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని రూపొందిస్తోంది.