Ilayaraja: ఇళయరాజా మ్యూజిక్ యూనివర్సిటీకి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్
ఇళయరాజా(Ilayaraja) అంగీకారంతో తెలంగాణలో త్వరలోనే మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్సిటీ(Music University)ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్(KTR) ప్రకటించారు.
పాపారావు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా మ్యూజిక్ స్కూల్(Music School Movie). ఈ మూవీని మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శ్రియా సరన్, శర్మన్ జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఇళయరాజా(Ilayaraja) మ్యూజిక్ అందించారు. తెలుగుతో పాటుగా హిందీలోనూ ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్(KTR) హాజరయ్యారు.
ఈవెంట్లో మంత్రి కేటీఆర్(KTR) మాట్లాడుతూ..పాపారావు తనకు మంచి మిత్రుడని అన్నారు. తెలంగాణ(Telangana) ఉద్యమంలో ఇద్దరం కలిసి పనిచేసినట్లు తెలిపారు. సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilayaraja) మాట్లాడుతూ..మ్యూజిక్ ఉంటే వైలెన్స్ ఉండదని, చీటింగ్ ఉండదని తెలిపారు. మ్యూజిక్ ఉంటే లక్ష్మీ దేవి ఉంటుందని, సరస్వతి ఉంటుందని అన్నారు. కేటీఆర్ చెప్పినట్లు మ్యూజిక్ యూనివర్సిటీ(Music University) వస్తే 200 మంది ఇళయరాజాలు తయారవుతారని తెలిపారు.
ఇళయరాజా(Ilayaraja) అంగీకారంతో తెలంగాణలో త్వరలోనే మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్సిటీ(Music University)ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్(KTR) ప్రకటించారు. పిల్లలకు సంగీత విద్య కూడా ప్రాధాన్యంగా ఉండాలన్నారు. త్వరలోనే మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన అన్ని విషయాలను ప్రకటిస్తామని తెలిపారు. దీంతో సంగీత ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.