»Balakrishna Who Sang The Song The Stage Resounded With Applause
Nandamuri Balakrishna: పాట పాడిన బాలకృష్ణ..చప్పట్లతో దద్దరిల్లిన స్టేజ్
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ లైవ్‌లో స్టేజ్‌పై పాట పాడాడు. ఆయన పాడిన పాటకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) మరోసారి స్టేజ్ పై పాట పాడి(Sing a Song) అందర్నీ ఉర్రూతలూగించారు. నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Ramarao) శత జయంతి వేడుకలు ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఖతార్ లోని దోహాలో కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ తనయుడు, టాలీవుడ్(Tollywood) టాప్ హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమంలో బాలయ్య లైవ్ లో పాట పాడారు.
లైవ్ లో పాట పాడిన బాలకృష్ణ వీడియో:
Standing ovation for #Balakrishna singing live in Doha yesterday. My friend Dr. Suresh, an ophthalmologist in Doha sent this.
నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Ramarao) నటించిన ‘జగదేకవీరుని కథ’ మూవీ నుంచి ‘శివశంకరి పాట'(Shivasankari Song)ను బాలయ్య ఆలపించారు. బాలకృష్ణ పాడిన పాటకు అక్కడున్నవారంతా ఫిదా అయ్యారు. ఈలలు వేస్తూ చప్పట్లతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. ప్రేక్షకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆఖర్లో అందరూ లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతున్నాయి.
గతంలో కూడా బాలకృష్ణ(Nandamuri Balakrishna) స్టేజ్ పై పాటలు పాడారు. హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు బాధితులకు అండగా నిలిచి ఆదుకునేందుకు నిర్వహించిన ఈవెంట్ లో బాలయ్య పాట పాడారు. ఆ తర్వాత లేపాక్షి ఉత్సవాల్లో, ఈ మధ్యనే వీరసింహారెడ్డి సినిమా(Veerasimha reddy) ఈవెంట్లో కూడా బాలయ్య పాటలు పాడారు. ‘పైసా వసూల్’ సినిమా కోసం ”అరె మామా ఏక్ పెగ్ లా” అనే పాటను కూడా బాలయ్య పాడారు. తాజాగా ఆయన పాడిన ‘శివశంకరి’ పాటకు ప్రేక్షకులు, అభిమానులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్(Video Viral) అవుతోంది.