టాలీవుడ్(Tollywood) హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Srinivas) ‘అల్లుడు శీను'(Alludu Sreenu Movie)తో హిట్ కొట్టాడు. నిర్మాత బెల్లంకొండ సురేష్(Bellamkonda Suresh) తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీనివాస్ విభిన్న కథనాలతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఎంత నిర్మాత కొడుకు అయినా పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసినా తనను మాత్రం ఆర్థిక సమస్యలు(Financial Problems) వదల్లేదని, ఆ సమస్యల వల్ల తన కెరీర్ పై దృష్టి పెట్టలేకపోయానని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. ఈ కుర్ర హీరో బాలీవుడ్(Bollywood) బాట పట్టి అక్కడ ఛత్రపతి సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నాడు.
తన తండ్రి వల్లే తాను సులభంగా ఇండస్ట్రీలోకి రాగలిగానని బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) చెప్పుకొచ్చాడు. అల్లుడు శీను సినిమా ప్రాజెక్టు ఓకే అయ్యాక తన డ్యాన్స్, డైలాగ్ డెలివరి తెలియజేసేలా ఓ డెమో తీసి సమంత, తమన్నాకు పంపించినట్లు శ్రీనివాస్ తెలిపాడు. ఆ డెమో చూసే అల్లుడు శీను మూవీలో నటించడానికి సమంత, తమన్నా ఒప్పుకున్నారన్నారు. ఆ మూవీ తర్వాత తన తండ్రి సురేష్ ఓ సినిమా చేశాడని, అయితే అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందని తెలిపారు.
తన తండ్రి డిస్టిబ్యూటర్ గా చేసిన ఎనిమిది సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయని, దాని వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఏడాదిన్నర పాటు సినిమాలు చేయకుండా ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత తక్కువ బడ్జెట్ తో ‘జయ జానకీ నాయక’ సినిమా చేశానని, బోయపాటి శ్రీను దయ వల్ల అన్ని విధాలుగా నిలదొక్కుకోగలిగానని అన్నారు.
‘ఛత్రపతి’ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నానని, కోవిడ్ కు ముందే ఆ ప్రాజెక్ట్ ఓకే అయినా ఇప్పటికి విడుదల అవుతోందన్నారు. సమంత తనకు మంచి స్నేహితురాలని, ఆమె అనారోగ్యానికి గురైనప్పుడు మెస్సేజ్ చేసినట్లు తెలిపారు. సమంత తనలో స్ఫూర్తిని నింపిందని అన్నారు. బాలీవుడ్ (Bollywood)లో తాము తీసే ఛత్రపతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) ఆశాభావం వ్యక్తం చేశారు.