»Ustad Bhagat Singh First Glimpse Release Date Fix
Ustad Bhagat Singh: స్పెషల్ డే మరింత స్పెషల్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ గ్లింప్స్!
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) చేస్తున్న సినిమాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh)' పై భారీ అంచనాలున్నాయి. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. పవన్, హరీష్ శంకర్ కలిసి 2012లో గబ్బర్ సింగ్ సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. పవన్ అభిమానిగా పవర్ స్టార్‌ను పవర్ ప్యాక్డ్గా చూపించాడు హరీష్. దాంతో మరోసారి ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు పవన్ ఫ్యాన్స్.
దశాబ్ద కాలం తర్వాత పవన్ కళ్యాణ్(pawan kalyan), హరీష్ శంకర్(harish shankar) కాంబినేషన్ వర్కౌట్ అయింది. అయితే ముందుగా భవదీయుడు భగత్‌సింగ్ టైటిల్‌తో సినిమా అనౌన్స్ చేసి.. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh)గా టైటిల్ మార్చారు. టైటిలె కాదు.. ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ ‘తేరీ’ రీమేక్‌గా తెరకెక్కుతోందనేది టాక్ ఇండస్ట్రీ టాక్. అయిన కూడా మార్పులతో అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నాడట హరీష్ శంకర్. ఇప్పటికే ఈ సినిమా ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
త్వరలోనే సెకండ్ షెడ్యూల్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉస్తాద్ ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు. మే 11తో గబ్బర్ సింగ్ రిలీజ్ అయి 11 ఏళ్లు కంప్లీట్ అవుతాయి. ఈ స్పెషల్ డే సందర్భంగా.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్టుగా.. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఒక వీడియో బైట్ ద్వారా తెలియజేశారు. హరీష్ శంకర్ బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారని, ఇది చిన్నదే అయినా సమ్‌థింగ్ బిగ్గా ఉంటుందని చెప్పుకొచ్చాడు దేవిశ్రీ. ఫుల్లీ లోడెడ్, మళ్లీ లోడెడ్ అంటూ రచ్చ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ ట్రెండింగ్‌లో ఉంది.
ఈ గ్లింప్స్ కోసం పవన్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు. ఖచ్చితంగా హరీష్ శంకర్ పవన్‌ను కొత్త మాస్ అవతారంలో చూపిస్తాడనే నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే మ్యూజిక్ పై అంచనాలు గట్టిగానే పెట్టుకున్నారు. గబ్బర్ సింగ్‌కు అదిరిపోయే మ్యూజిక్ ఆల్బమ్ ఇచ్చాడు దేవి. ఈసారి అంతకు మించి అనేలా ఉస్తాద్ ఆల్బమ్ ఉంటుందని అంటున్నారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుందో చూడాలి.