నిన్న(మే 5న) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఉగ్రం(ugram) సినిమా కొన్ని హైప్ లతో యావరేజ్ మూవీగా టాక్ తెచ్చుకుంది. మరికొంత మంది ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్షన్లు సాధించిందో ఇప్పుడు చుద్దాం.
కెరీర్ స్టార్టింగ్‌లో కామెడీ సినిమాలతో దుమ్ములేపాడు అల్లరి నరేష్(allari naresh). అసలు నరేష్ కామెడీ అంటే.. జనం చెవులు కోసుకునే వారు. కానీ మధ్యలో నరేష్ ట్రాక్ తప్పాడు. రొటీన్ కామెడీతో అలరించలేకపోయాడు. అందుకే రూట్ మార్చి సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు నరేష్. 2021లో వచ్చిన నాంది మూవీ నరేష్‌కి సూపర్ హిట్ ఇచ్చింది.
కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల(vijay kanakamedala) తెరకెక్కించిన ఈ సినిమా.. నిజంగానే నరేష్‌కు కెరీర్‌కు మరో నాంది పడేలా చేసింది. ఈ సినిమా తర్వాత మాత్రం మరోసారి ఫ్లాప్ అందుకున్నాడు. ఇటీవల వచ్చిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో మరోసారి నాంది డైరెక్టర్ పైనే ఆశలు పెట్టుకున్నాడు అల్లరోడు.
హిట్ కాంబోలో ఉగ్రం అనే సినిమా తెరకెక్కించగా..నిన్న(మే 5న) విడుదలై మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ మూవీ బాక్సాఫీస్(box office) వద్ద ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు చుద్దాం. Ugram మూవీ మొదటి రోజు దేశవ్యాప్తంగా కోటి రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ చిత్రానికి బడ్జెట్ సుమారు రూ.20 కోట్లు అయినట్లు తెలుస్తోంది.
ఉగ్రం బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు అనుకున్నదాని కంటే తక్కువగా పర్ఫామ్ చేసింది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో కలెక్షన్లు(collections) పెరుగుతాయే లేదో చూడాలి.
అల్లరి నరేష్, మిర్నా మీనన్ లతో పాటు, ఈ చిత్రంలో ఇంద్రజ, అలనాటి నటి శరత్ లోహితస్వ, శత్రు, శ్రీనివాస్ సాయి, మణికంఠ వారణాసి, నాగ మహేష్, రమేష్ రెడ్డి, బాబు ఊహా రెడ్డి, కౌశిక్ మహతా సహా పలువురు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు.
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, అంజి ఇండస్ట్రీస్ బ్యానర్లపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. సిద్ధార్థ్ జె, ఛోటా కె ప్రసాద్ సినిమా ఛాయాగ్రహణం, ఎడిటింగ్‌లను నిర్వహించారు. శ్రీచరణ్ పాకాల సినిమా సౌండ్‌ట్రాక్, ట్యూన్లను స్వరపరిచారు. ఉగ్రమ్ కథను తూమ్ వెంకట్ రాయగా.. సంభాషణలను అబ్బూరి రవి అందించారు.