Naga Chaitanya:సమంత (Samantha)- చైతన్య (Naga Chaitanya) విడిపోయి రెండేళ్లు అవుతోంది. అయినప్పటికీ వారి గురించి చర్చే.. సినిమా ప్రమోషన్స్ వచ్చిందంటే చాలు.. రిపోర్టర్స్ కాచుకొని కూర్చొంటారు. కస్టడీ మూవీ ప్రమోషన్స్‌లో చైతన్య (Chaitanya)బిజీగా ఉన్నాడు. ఈ రోజు మీడియా ప్రతినిధుల నుంచి మళ్లీ సమంత గురించి ప్రశ్న వచ్చింది. ఈ సారి చాలా సేపు మాట్లాడు. తమ మధ్య గొడవకు కారణం సోషల్ మీడియా అని చెప్పారు.
సమంత (Samantha) మంచి మనసు గల వ్యక్తి అని చైతన్య (Chaitanya) అన్నారు. ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. చట్ట ప్రకారం విడిపోయాయని.. ఏడాది క్రితం విడాకులు కూడా తీసుకున్నామని తెలిపారు. ఎవరి జీవితాల్లో వారు ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు తమ మధ్య ఇబ్బందికర పరిస్థితులకు కారణం అని తెలిపారు. తమకు ఒకరిపై మరొకరికి గౌరవం లేనట్టు ప్రజల్లోకి వెళ్లిందని గుర్తుచేశారు. ఆ విషయం తానను బాధించిందని ఒపెన్ అయ్యారు. తన గతంతో సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి తాగారని చెప్పారు.
మూవీ ప్రమోషన్స్ సమయంలో వ్యక్తిగత జీవితంపై ప్రశ్నిస్తుంటారని చైతన్య (Chaitanya) చెప్పారు. తొలుత వాటిని పట్టించుకోలేదని చెప్పారు. పదే పెళ్లి గురించి వదంతులు సృష్టిస్తున్నారని.. దీని వల్ల వారికి ఒరిగే ప్రయోజనం ఏంటో అర్థం కావడం లేదన్నారు.
చైతన్య (Chaitanya) కొత్త కస్టడీ మూవీతో ముందుకు రాగా.. సమంత ఇటీవల శాకుంతలం చేసింది. ఆ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. అంతకుముందు తీసిన యశోద కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. సిటాడెల్ హిందీ వెర్షన్లో కూడా సమంత నటిస్తున్నారు.