Actor Mahesh: జనసేన నుంచి పోటీ చేస్తా.. రంగస్థలం మహేష్..!
నటుడు మహేష్ అనే కంటే, రంగస్థలం మహేష్ అనే అందరికీ బాగా గుర్తుకు వస్తాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ పక్కన త్రూ అవుట్ క్యారెక్టర్ చేయడంతో ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాడు. దానికి ముందు, తర్వాత ఎన్ని సినిమాలు చేసినా, అతనిని అందరూ రంగస్థలం మహేష్ గానే గుర్తుపెట్టుకున్నారు. ఈ సంగతి పక్కన పెడితే, మహేష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా చెప్పడం విశేషం.
పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తే జనసేన నుండి పోటీ చేస్తానని నటుడు మహేష్ తెలిపారు. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయినా మహేష్..ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు విశేషాలు తెలుపుతూ..రాజకీయాలపై స్పందించారు. జనసేన పార్టీ గనుక తనకు టికెట్ ఇస్తే.. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. పవన్ కల్యాణ్ ది చాలా గొప్ప వ్యక్తిత్వం అని, ఆయనతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించానన్నారు మహేష్. అంతే కాదు ఆయన గొప్ప మనస్తత్వం గురించి చెపుతూ.. మూవీ సెట్స్‌లో పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారో, ఏం తింటారో కూడా చెప్పుకొచ్చాడు. తన ఊరిలో పవన్ కల్యాళ్ అభిమానుల ఎక్కువగా ఉన్నారని. జనసేన కోసం స్థానికంగా పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారని మహేష్ తెలిపారు. దేవుడి దయ వల్ల పార్టీ తరఫున తనకు పోటీచేసే ఛాన్స్ వస్తే కచ్చితంగా నిలబడతానన్నారు. ఇప్పుడు మాత్రం తన ఆసక్తి మొత్తం సినిమాల మీదే ఉందని మహేష్ వివరించారు.