»The Government Announced Free Sand Policy In Ap These Are The Conditions
Free sand policy: ఏపీలో ఉచిత ఇసుక విధానం ప్రకటించిన ప్రభుత్వం.. కండీషన్స్ ఏంటంటే?
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇసుక రవాణకు సంబంధించి తాత్కాలిక విధివిధానాలను ఇచ్చింది. 2019-2021 సంవత్సరాలకు సంబంధించిన విధానాలను రద్దు చేసింది. తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇసుకను వినియోగాదారులకు ఉచితంగా అందుబాటులో ఉంచాలని పేర్కొంది.
The government announced free sand policy in AP.. these are the conditions
Free sand policy: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇసుక రవాణకు సంబంధించి తాత్కాలిక విధివిధానాలను ఇచ్చింది. 2019-2021 సంవత్సరాలకు సంబంధించిన విధానాలను రద్దు చేసింది. తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇసుకను వినియోగాదారులకు ఉచితంగా అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ప్రభుత్వ ఖాజానాకు రెవిన్యూ రాకున్నా సరే ఇసుకను అవసరం అయిన వారికి అందుబాటులో ఉంచాలంది. అయితే దీనిపై పటిష్టమైన చట్టాలు చేస్తున్నట్లు ఈ మేరకు జిల్లా అధికారులకు సూచించింది. ఈ మేరకు సీఎంవో నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కొన్ని జిల్లాల్లోని స్టాక్ పాయింట్ల వద్ద మంత్రులు ఉచిత ఇసుక సరఫరా ప్రారంభించారు.
రాష్ట్రంలో ఇప్పుడు వేర్వేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయని, ఆ స్టాక్ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరా సాగేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిపై జిల్లా కలెక్టర్లకు అంతర్గత మార్గదర్శకాలు ఇస్తామని, వాటికనుగునంగా అధికారులు పనిచేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఇసుక విధానం రూపకల్పన వరకు ఇప్పుడు ఇచ్చిన మార్గదర్శకాలు కొనసాగించాలని ప్రభుత్వం చెప్పింది. ఇక రేపు ఇసుకపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. అలాగే రిజర్వాయర్లు, చెరువులు, ఇతరు నీటి వనరులపై డీసిల్టేషన్ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీసిల్టేషన్ ఎక్కడెక్కడ చేపట్టాలన్నది జిల్లా స్థాయిలో కమిటీలు నిర్ణయిస్తామని పేర్కొంది. ఇసుక అక్రమనకు ఎవరు పాల్పడిచనా ఉపక్షించేది లేదని, కఠినమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.