ప్రముఖ హీరో గోపీచంద్(Gopichand) నటించిన రామబాణం(Raamabaanam) మూవీ నిన్న(మే5న) రిలీజైంది. ఈ క్రమంలో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ గా పర్ఫామ్ చేసింది. ఆ కలెక్షన్స్, ఆక్యుపెన్సీ, బడ్జెట్ వివరాలు ఇప్పుడు చుద్దాం.
మాచో స్టార్ గోపీచంద్(Gopichand) మరో కొత్త సినిమా రామబాణంతో నిన్న(మే 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ ఎక్కువగా వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రాన్ని పలువురు మెచ్చుకోగా..ఇంకొంత మంది బాలేదని చెప్పారు. ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించారు. ఇది వరకూ గోపీచంద్(Gopichand), శ్రీవాస్(srivas) కాంబోలో లక్ష్యం, లౌక్యం వంటి రెండు సినిమాలు వచ్చాయి. తాజాగా మరో హ్యాట్రిక్ ఫిల్మ్ రామబాణం(Raamabaanam) తెరకెక్కింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మించారు.
అయితే ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీలో కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఈ చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఎంత వసూల్లు రాబట్టిందో ఇప్పుడు చుద్దాం. థియేట్రికల్ విడుదలైన ఈ మూవీ మొదటి రోజు దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 2.50 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు మార్నింగ్ షోల ఆక్యుపెన్సీ రేషియో 18.72 శాతం ఉండగా.. చివరికి 20.61 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.25 కోట్లు అని తెలిసింది.
గోపీచంద్ నటించిన ఈ చిత్రంలో నటి డింపుల్ హయాతి(dimple hayathi) కథానాయికగా నటించింది. జగపతి బాబు, ఖుష్బు, అలీ, తరుణ్ రాజ్ అరోరా, నాజర్, శుభలేఖ సుధాకర్, సచిన్ ఖేడేకర్, కాశీ విశ్వనాథ్, వెన్నెల కిషోర్, సత్య, సప్తగిరి, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రాన్ని రామబాణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేయగా, మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించారు. భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించగా వెట్రి పళనిసామి కెమెరా వర్క్ చేశారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా(world wide) 840కి పైగా స్క్రీన్లలో విడుదలైంది.