స్టార్ హీరో ప్రభాస్(prabhas) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మే 9న ఆదిపురుష్(Adipurush) ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
2023లో ప్రపంచం అంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్(Adipurush). ఇప్పటికే భారీ అంచనాలు తెచ్చుకున్న ఆదిపురుష్ మూవీ ట్రైలర్(trailer) లాంచ్ కు వేళయింది. మే 9న గ్లోబల్ ట్రైలర్ లాంచ్‌తో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ మెగా ట్రైలర్ లాంచ్‌ను ప్రకటిస్తూ.. ఆదిపురుష్ నుంచి పాన్-ఇండియా స్టార్, ప్రభాస్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మాగ్నమ్ ఓపస్ ఇప్పటికే న్యూయార్క్‌లోని ట్రిబెకా ఫెస్టివల్లో అంతర్జాతీయ ప్రీమియర్‌కు సెలెక్ట్ కావడం ద్వారా ఓ గొప్ప మైల్ స్టోన్ ను సాధించింది. ఇప్పటికే విడుదలైన ప్రతి గ్లింప్స్ తో ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచింది.
ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం అద్భుతమైన ట్రైలర్ తో రెడీ అయ్యింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా(world wide) 70 దేశాలలో ఈ ట్రైలర్ ను రికార్డ్ స్థాయిలో లాంచ్ చేయబోతున్నారు. అందుకే ఇది వరల్డ్ ఈవెంట్ గా మారింది. భారతదేశంతో పాటు సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్‌తో సహా యూఎస్ఏ, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియా & దక్షిణాసియాలోని భూభాగాల్లో; ఆఫ్రికా, యూకే అండ్ యూరప్, రష్యా, ఈజిప్ట్ దేశాల్లో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ గొప్ప భారత ఇతిహాస కథ ప్రపంచ ప్రేక్షకులను ఓ సాహసోసేతమైన యాక్షన్ ప్రపంచంలోకి తీసుకువెళుతుంది.
ప్రభాస్(prabhas), కృతిసనన్(kritisanon), సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
సాంకేతికంగా అత్యున్నతంగా ఉండబోతోన్న ఈ చిత్రానికి
టెక్నికల్ టీమ్ పి.ఆర్.వో : జి.ఎస్.కే మీడియా ఎడిటర్ : అపూర్వ మోతీవాలే సాహై, ఆశిష్ మాత్రే, డివోపి : కార్తీక్ పల్నాని సంగీతం : అజయ్ – అతుల్ నిర్మాతలు : టి సిరీస్ భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ దర్శకత్వం : ఓమ్ రౌత్