హైదరాబాద్(Hyderabad), సికింద్రాబాద్(secunderabad) జంట నగరాల్లో పోలీస్ స్టేషన్లను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 40 పోలీస్ స్టేషన్ల(police stations)ను తెలంగాణ(Telangana) సర్కార్ ఏర్పాటు చేయనుంది. కొత్తగా దోమలగూడ, సెక్రటేరియట్, ఖైరతాబాద్, వారసిగూడ, బండ్లగూడ, ఐఎస్ సదన్, గుడి మల్కాపూర్, ఫిలింనగర్, మధురా నగర్, మాసబ్ ట్యాంక్, బోరబండ, మోకిల్లా, అల్లాపూర్, సూరారం, జీనొమ్ వ్యాలీ, కొల్లూర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
అదేవిధంగా కొత్తగా 11 లా అండ్ ఆర్డర్, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు(TraFic Police Stations) ఏర్పాటు చేసింది. రెండు టాస్క్ ఫోర్స్ జోన్లను కూడా ఏర్పాటు చేస్తూ తెలంగాణ(Telangana) సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా మేడ్చల్, రాజేంద్ర నగర్ టాస్క్ ఫోర్స్ జోన్లుగా ప్రకటించింది. వాటితో పాటుగా 6 డీసీపీ జోన్ల(DCP Zones)ను కూడా ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ లో 12 డివిజన్లు, సైబరాబాద్ లో 3 డీసీపీ జోన్లు(DCP Zones), ప్రతి జోన్‌కూ ఒక మహిళా పోలీస్ స్టేషన్ (Mahila Police stations)ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ(Telangana) సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఏరియాలో కూడా సైబర్ క్రైమ్(Cyber Crime), నార్కోటింగ్ వింగ్ ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రజల సౌకర్యార్థం, శాంతి భద్రతల దృష్ట్యా ఈ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.