TG: హైదరాబాద్లో బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్ రావు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. పార్టీ బలోపేతం, పంచాయతీ ఎన్నికలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర బీజేపీ కమిటీకి ఆ పార్టీ కీలక నేత బీఎల్ సంతోష్ దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.