పాతబస్తీ (old town) లాల్ దర్వాజ బోనాల వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. పాతబస్తీలో ఆదివారం బోనాలు, సోమవారం ఘట్టాల ఊరేగింపుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలో ఆది, సోమవారాల్లో పాతబస్తీ, అంబర్‌పేట (Amberpet) ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. జులై 16వ తేదీ ఉదయం 6 గంటల నుండి జులై 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ రూట్లలో దారి మళ్లింపు చర్యలు అమలులోకి ఉంటాయి.
ఉప్పల్ (Uppal) నుండి అంబర్పేట్ వైపు వచ్చే అన్ని జిల్లాల బస్సులు, సిటీ బస్సులు, భారీ వాహనాలు ఉప్పల్ x రోడ్డులో హబ్సిగూడ – తార్నాక – అడిక్‌మెట్ – విద్యా నగర్ – ఫీవర్ హాస్పిటల్(Fever Hospital) – T.Y మీదుగా మళ్లిస్తారు. మండలి – టూరిస్ట్ హోటల్ Jn. – నింబోలిఅడ్డ – చాదర్‌ఘాట్ & C.B.S. తిరిగి వచ్చే మార్గం వైస్ వెర్సాగా ఉంటుంది. కోటి నుండి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు, సిటీ బస్సులు నింబోలిఅడ్డ – టూరిస్ట్ హోటల్ – TY మండలి – ఫీవర్ హాస్పిటల్ – అడిక్‌మెట్ – తార్నాక – హబ్సిగూడ – ఉప్పల్ X రోడ్ల మీదుగా తిరుగు మార్గంలో మళ్లిస్తారు.
ఉప్పల్ నుండి అంబర్పేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను రాయల్ జ్యూస్ కార్నర్ – మల్లికార్జున నగర్ – డి డి కాలనీ – సిండికేట్ బ్యాంక్ – శివం రోడ్ వద్ద మళ్లిస్తారు. గోల్నాక, మూసారాంబాగ్ (Musarambagh) వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సీపీఎల్ వైపు మళ్లిస్తారు. అంబర్పేట్ – సల్దానా గేట్ – అలీ కేఫ్ X రోడ్లు మరియు తిరుగు మార్గంలో వైస్ వెర్సా ఉంటుంది.ఈ రూట్లలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలుంటాయని, ఎటువంటి అడ్డంకులు లేకుండా గమ్యస్థానాలకు చేరుకోవడానికి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని సిటీ పోలీసులు కోరారు.