పవన్ వారాహి యాత్రలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు వైసీపీ, వాలంటీర్ల నుంచి నిరసనలు ఎదురవుతున్నాతగ్గడం లేదు. తాను అనుకున్నది, చెప్పాలనుకునేది కచ్చితంగా సూటిగా చెబుతున్నారు పవన్. తాజాగా ఆయన తాడేపల్లిగూడెం, తణుకులో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సీఎం జగన్, వాలంటీర్లపై హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆందోళనల మధ్య వారాహి యాత్ర సాగుతోంది. వాలంటీర్లపై హాట్ కామెంట్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ పై అడుగడుగునా నిరసనల సెగ చెలరేగుతోంది.
తణుకులో వైసీపీ కార్యకర్తలు ఏకంగా పవన్ ర్యాలీకి అడ్డుకున్నారు. పవన్ యాత్రలో నిరసన తెలపడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తణుకులో ర్యాలీ తర్వాత వీర మహిళలతో సమావేశమైన పవన్ సీఎం జగన్ టార్గెట్గా కీలక కామెంట్స్ చేశారు. ఇకపై తన కుటుంబం జోలికొస్తే అస్సలు ఊరుకోనని హెచ్చరికలు చేశాడు. తాడేపల్లిగూడెంలో వాలంటీర్లపై మళ్లీ పలు వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లది ప్రైవేట్ ఆర్మీ అని, ప్రజలను, వనరులను దోచుకోవడానికి వైసీపీ పెట్టుకున్న సైన్యం అని ఆరోపణలు చేశారు.
జనసేన(Janasena) ఏ పార్టీకి B టీమ్ కాదని, మర్డర్ టీమ్ ఎవరిదో, క్రిమినల్స్ గుంపు ఏదో ప్రజలకు తెలుసని అన్నారు. శ్రీకాళహస్తిలో సీఐ అంజుయాదవ్(CI Anjuyadav)పై పవన్ నిప్పులు చెరిగారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే కొట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. శ్రీకాళహస్తికి వచ్చి అక్కడే తేల్చుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వార్నింగ్ ఇచ్చారు.