»Another Twist In Vivekas Murder Case Cbi Court Summons To Mp Avinash Reddy
Breaking: వివేకా హత్యకేసులో మరో ట్విస్ట్..ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు
వైఎస్ వివేకా హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు మరోసారి వాయిదా వేసింది. ఆగస్టు 14వ తేదిన ఈ కేసు విచారణను వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని ఎనిమిదవ నిందితుడిగా చేర్చుతూ కోర్టు పేర్కొంది.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి ( Viveka Murder Case ) హత్యకేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ కోర్టు శుక్రవారం సమన్లు ఇచ్చింది. ఆగస్టు 14వ తేదిన అవినాష్ రెడ్డి కచ్చితంగా కోర్టులో హాజరు కావాలని సమన్లలో వెల్లడించింది. ఈ హత్యా కేసులో ఎనిమిదవ నిందితుడిగా అవినాష్‌రెడ్డి పేరును చేర్చుతూ కోర్టు తీర్పునిచ్చింది. అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై సీబీఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుని విచారించింది. ఈ కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న నిందితులు శుక్రవారం సీబీఐ కోర్టులో హాజరయ్యారు. విచారణకు సహకరించారు. అయితే వీరికి మరోసారి ఆగస్టు 14వ తేది వరకు రిమాండ్ పొడిగిస్తూ సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. ఎంపీ అవినాష్‌రెడ్డి ఈ కేసులో ముందస్తు బెయిల్ ను ఇదివరకే పొందిన సంగతి తెలిసిందే.