»Traffic Restrictions In Hyderabad Tomorrow On The Occasion Of Ramzan
Makka masidu : రంజాన్ సందర్భంగా హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
రంజాన్ (Ramadan) పండుగకు ముందు, హైదరాబాద్(Hyderabad) ట్రాఫిక్ పోలీసులు ఏప్రిల్ 21 శుక్రవారం నుండి అమలులోకి వస్తుందని ప్రకటించారు. అదే రోజు, అంటే రంజాన్ మాసం చివరి శుక్రవారం, మక్కా మసీదులో ప్రార్థనలు చేస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్లోని జామ్-ఎ-మసీద్ ఉన్నందున ఈ మార్గాలపై ఆంక్షలు విధించారు. చార్మినార్(Charminar) మరియు మదీనా, చార్మినార్ మరియు ముర్గీ చౌక్, మరియు చార్మినార్ మరియు రాజేష్ మెడికల్ హాల్, శాలిబండ మధ్య రోడ్లు శుక్రవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలకు మూసివేయబడతాయి.
రంజాన్ (Ramadan) మాసం చివరి శుక్రవారం కావడంతో మక్కమసీదు వద్ద ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్థలు చేస్తున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్లోని (Secunderabad) జామ్-ఎ-మసీదులో కూడా ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ప్రార్థనల్లో పెద్దసంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు (Police) భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రత్యేక ప్రార్థనల దృష్ట్యా పాతబస్తీ (old town) పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతాయని ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు.