»Revanth Reddys Swearing In As Cm Today Traffic Restrictions On Those Routes
Revanth Reddy: నేడు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం..ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
నేడు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ తరుణంలో హైదాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఉంటుందని, వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం ఉండటం వల్ల గట్టి నిఘా ఉంచినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సీఎంగా నేడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రోజు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు ఆయన చేత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. రేవంత్ రెడ్డితో పాటుగా మరికొద్ది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలంతా తరలి వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ కు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, ఖర్గే, ఇండియా కూటమి నేతలు, స్టాలిన్, మమతా బెనర్జీ, పీసీసీ చీఫ్‌లు, ఎమ్మెల్యేలు, 300 మంది అమరవీరుల కుటుంబాలు, మరో 250 మంది తెలంగాణ ఉద్యమకారులు, ఇతర రాష్ట్రాల నేతలు సీఎం ప్రమాణ స్వీకారానికి తరలి రానున్నారు. ఈ తరుణంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు గట్టి నిఘాను ఉంచారు. దీంతో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు.
నేటి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. వాహనదారులు ఈ విషయాలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 9010203626 నంబర్‌కు ఫోన్ చేయాలని వెల్లడించారు.
Chief Minister Revanth Reddy Reached Hyderabad
బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సీఎస్ శాంతికుమారి, ఇన్ఛార్జ్ డీజీపీ రవిగుప్తా, పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, ఐపీఎస్ రమేష్, చందన దీప్తి తదితరులు ఘనస్వాగతం… pic.twitter.com/7ISDL809yf
పబ్లిక్‌గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు. అలాగే బషీర్‌బాగ్ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్ కోఠి వైపు మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ఎల్బీ స్టేడియంలో నేడు 30 వేల మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉండటంతో మిగిలిన వారి కోసం స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు చేశామని తెలిపారు.