»Supreme Court Has Stay On Telangana High Court Interim Orders
Avinash ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే.. 24 వరకు అరెస్ట్ చేయొద్దని స్పష్టీకరణ
సుప్రీంకోర్టులో సునీత, అవినాష్ ఇద్దరికీ ఊరట కలిగింది. అవినాష్ ముందస్తు బెయిల్‌పై స్టే విధించింది. అవినాష్‌ను ఈ నెల 24వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐకి స్పష్టంచేసింది.
Supreme court has stay on Telangana high court Interim orders
Supreme court:వివేకా హత్య కేసులో అవినాష్‌కు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌కు సంబంధించి సునీత (sunitha) సుప్రీంకోర్టులో (supreme court) వేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించింది. స్టే విధిస్తే.. సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.
కేసుకు సంబంధించి పేపర్ బుక్ కూడా తమ వద్ద లేదని అవినాష్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సునీత పిటిషన్ లో ఏముందో కూడా తమకు తెలియదన్నారు. పేపర్ బుక్ తమ వద్ద ఉంటే ఇప్పుడే వాదనలు వినిపించేవాళ్లమని చెప్పారు. సోమవారం తమ వాదనలను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరడంతో అప్పటివరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో అవినాశ్ కు స్వల్ప ఊరట కలిగింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని అవినాష్, సీబీఐకి ధర్మాసనం ఆదేశించింది.
హైకోర్టు కూడా ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దని.. ఆ రోజు తుది తీర్పును వెల్లడిస్తానని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. అప్పటివరకు రోజు సీబీఐ విచారణకు హాజరుకావాలని అవినాష్‌కు స్పష్టంచేసింది. దీంతో అవినాష్ సహా ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, మిత్రుడు ఉదయ్ కుమార్ రెడ్డి కూడా విచారణకు హాజరవుతున్నారు.
సోమవారం రోజున సుప్రీంకోర్టు అవినాష్ అరెస్ట్‌పై ఆదేశాలు ఇవ్వనుంది. ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే.. ఆ మరుసటి రోజు హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోదు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకుంటే.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 30వ తేదీ లోపు వివేకా హత్య కేసు నివేదిక తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు సీబీఐకి స్పస్టంచేసిన సంగతి తెలిసిందే. దాంతో కేసు విచారణ స్పీడందుకుంది.