“అనువుగాని చోట అధికులమన రాదు” అనే సామెత పగటెచ్చుల దొర KCRకు సరిగ్గా సరిపోతుందని ట్వీట్ స్టార్ట్ చేశారు. తినడానికి తిండి లేదు కానీ సోకులకు లోటా అన్నట్టు విశాఖ ఉక్కు (vizag steel) కొంటానని పది మందిలో రాష్ట్ర పరువు తీశాడని షర్మిల మండిపడ్డారు. బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ నిరూపించుకున్నాడని మండిపడ్డారు.
"అనువుగాని చోట అధికులమన రాదు" అనే సామెత పగటెచ్చుల దొర KCRకు సరిగ్గా సరిపోతుంది.తినడానికి తిండి లేదు కానీ సోకులకు లోటా అన్నట్లు విశాఖ ఉక్కు కొంటానని,ఇప్పుడు పది మందిలో రాష్ట్ర పరువు తీశాడు.గొప్పలకు పోయి బొక్కబోర్లపడ్డడు. కపట ప్రేమలు కురిపించి, హెచ్చులకు పోయి నవ్వుల పాలయ్యాడు. 1/3
తెలంగాణ బిడ్డవు అయితే.. గతంలో హామీ ఇచ్చిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ (bayyaram steel factory) నిర్మించాలని షర్మిల సూచించారు. 100 రోజుల్లో నిజాం షుగర్స్ (sugar factory) తెరిపిస్తా అని చెప్పిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. మూతపడిన వందలాది ఫ్యాక్టరీలను (factory) తెరిపించాలని సూచించారు.
బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ అనిపించుకున్నాడు. అయినా అడ్డంపొడుగు మాటలతో జనాలను ఫూల్స్ చేయడం దొరకు వెన్నతో పెట్టిన విద్య. దొరా నీవు తెలంగాణ బిడ్డవే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే నీకు ముఖ్యం అనుకుంటే… గతంలో హామీ ఇచ్చినట్లుగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించు. 2/3
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలని.. రోడ్డున పడ్డ లక్షలాది కార్మికులను ఆదుకోవాలని సూచించారు. నీచ రాజకీయాల కోసం ప్రతీసారి రాష్ట్ర పరువును ఫణంగా పెడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని మండిపడ్డారు. షర్మిల (sharmila) వరసగా ట్వీట్స్ చేశారు. ప్రతీ అంశం మీద తెలంగాణ ప్రభుత్వాన్ని షర్మిల ప్రశ్నిస్తూనే ఉన్నారు.
100 రోజుల్లో నిజాం షుగర్స్ తెరిపిస్తా అంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకో. మూతపడిన వందలాది ఫ్యాక్టరీలను తెరిపించు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టు. రోడ్డున పడ్డ లక్షలాది కార్మికులను ఆదుకో. నీ నీచ రాజకీయాల కోసం ప్రతీసారి రాష్ట్ర పరువును పణంగా పెడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. 3/3