»Telangana Rains In Hyderabad And 20 Districts Next 2 Days
Rains: దంచికొడుతున్న వర్షం..బయటకొస్తే జాగ్రత్త!
రాష్ట్రంలో వానలు తెల్లారినుంచి జోరుగా కురుస్తున్నాయి. హైదరాబాద్ తోపాటు పలు చోట్లు కుండపోత వర్షం కురుస్తోంది. ఈ వర్షాలు మూడు రోజులు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు.
telangana rains in hyderabad and 20 districts next 2 days
తెలంగాణ(telangana)లో వర్షాలు(rains) తెల్లవారుజామునుంచే దంచికొడుతున్నాయి. అయితే నేటితోపాటు మూడు రోజులు వానలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉన్న క్రమంలో ప్రజలు బయటకు వచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. అంతేకాదు హైదరాబాద్లో కొత్త ప్రాంతాల్లో ప్రయాణించే విషయంలో ప్రజలు నాళాలు ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. దీంతోపాటు లోతట్టు కాలనీల ప్రజలు కూడా జాగ్రత్త వహించాలన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలోని 20 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్(hyderabad) వాతావరణ శాఖ వెల్లడించింది. వాటిలో ఉత్తర, దక్షిణ జిల్లాలు అయిన ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కొత్తగూడెం ఉన్నాయి.
మరోవైపు వాయుగుండం ప్రభావంతో శనివారం సాయంత్రం రాష్ట్రంలోని(state wide) పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల సెప్టెంబరు 3న అల్పపీడనంగా మారుతుందని వెదర్ రిపోర్ట్ వెల్లడించింది. అలాగే రెండు ద్రోణులు – కర్ణాటక నుంచి కొమొరిన్ మీదుగా విదర్భ వరకు ఒకటి, ఆంధ్రప్రదేశ్ వరకు కూడా వ్యాపిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.