నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) చురుకుగా కదులుతున్నాయి. కర్ణాటక, తమిళనాడులోని, ఏపీలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (weather station) వెల్లడించింది. తెలంగాణలోకి వచ్చే వారం ప్రవేశించే అవకాశాలున్నాయని అంచనా వేసింది. పశ్చిమ దిశ నుంచి తెలంగాణ (Telangana) రాష్ట్రంవైపు దిగువస్థాయిలో గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాబోయే రెండురోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరో వైపు సోమవారం పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు(Temperatures)భారీగానే నమోదయ్యాయి.
ఆదిలాబాద్లో 42.3, భద్రాచలం (Bhadrachalam) 42.2, నల్లగొండలో 41.5, రామగుండంలో 41.4, హనుమకొండలో 41, మెదక్ 40.2, నిజామాబాద్లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ వివరించింది.అరేబియా సముద్రంలో ఈ ఏడాది తొలిసారి ఏర్పడిన బిపోర్జాయ్ తుఫాను అతితీవ్రంగా మారింది. ప్రస్తుతం గుజరాత్(Gujarat) వైపు దూసుకువస్తుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. నైరుతి రుతుపవనాల రాకతో .తెలంగాణ రాయలసీమ (Rayalaseema) తో పాటు సరిహద్దుగా ఉన్న తమిళనాడు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.